ధాన్యం కొనడం లేదని రైతుల ధర్నా

ABN , First Publish Date - 2022-06-11T05:30:00+05:30 IST

ధాన్యం కొనడం లేదని రైతుల ధర్నా

ధాన్యం కొనడం లేదని రైతుల ధర్నా
దౌల్తాబాద్‌లో రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులు


దౌల్తాబాద్‌, జూన్‌11: ధాన్యం కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు తెచ్చి ఽనాలుగు రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. శనివారం దౌల్తాబాద్‌లోని పీఏసీఎస్‌ కార్యాలయం రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై బైటాయించారు. దీంతో గంటసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యాన్ని నాలుగు రోజులు క్రితం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చామని, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం పీఏసీఎస్‌ కార్యదర్శి అనంతయ్యతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్సై రమేశ్‌కుమార్‌ అక్కడికి చేరుకొని.. రైతులను సముదాయించి ధర్నాను విరమింపజేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్‌ కార్యదర్శి అనంతయ్యను ప్రశ్నించగా.. ఇప్పటికే సహకార సంఘం ఆధ్వర్యంలో రూ.లక్షా 85వేల బస్తాల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించినట్లు తెలిపారు. మిగతా 60 నుంచి 70వేల బస్తాలు రైతులు తీసుకువచ్చారని, అధికారులతో మాట్లాడి కొడంగల్‌ సబ్‌ మార్కెట్‌ యార్డుకు తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Read more