రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-07-19T05:18:18+05:30 IST

రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలి

రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలి
కొందుర్గు: సంతకాలు సేకరిస్తున్న బీజేపీ నాయకులు

షాద్‌నగర్‌ రూరల్‌/కొందుర్గు, జూలై 18: తెలంగాణాలో రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని బీజేపీ షాద్‌నగర్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి శ్రీవర్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఫరూఖ్‌నగర్‌ మండలం మొగిలిగిద్దలో రైతులతో సంతకాలు సేకరించారు. రుణమాఫీ అమలు చేసే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలను కేసీఆర్‌ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఫసల్‌బీమా యోజనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కిసాన్‌ మోర్చా రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వెంకటే్‌షగుప్త, సీనియర్‌ నాయకులు బాబయ్య, మండల శాఖ అధ్యక్షుడు వెంకటేష్‌ యాదవ్‌, నాయకులు మధుసూదన్‌రెడ్డి, వెంకటేష్‌, నరేష్‌, భరత్‌ పాల్గొన్నారు. అదేవిధంగా కొందుర్గు మండల కేంద్రంలో శ్రీవర్ధన్‌రెడ్డి సంతకాల సేకరణ చేపట్టారు. ఆయన వెంట పార్టీ సీనియర్‌ నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, అందె బాబయ్య, విష్ణువర్దన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీశైలం, శ్రీశైలం, శివారెడ్డి, లక్ష్మయ్యగౌడ్‌, ఎస్‌.అంజయ్య, సత్యనారాయణ, వెంకటేష్‌, బి.అశోక్‌, సుధాకర్‌, యాదయ్య పాల్గొన్నారు.

Read more