‘దోపిడీ పాలనను అంతమొందించాలి ’

ABN , First Publish Date - 2022-06-12T05:26:44+05:30 IST

‘దోపిడీ పాలనను అంతమొందించాలి ’

‘దోపిడీ పాలనను అంతమొందించాలి ’

చౌదరిగూడ/కడ్తాల్‌/శంషాబాద్‌ రూరల్‌, జూన్‌ 11: రాష్ట్రంలో దోపిడీపాలనను అంతమొందించేందుకు ప్రజలంతా ఏకం కావాలని కాంగ్రెస్‌ పార్టీ షాద్‌నగర్‌ నియోజకవర్గం సీనియర్‌ నాయకుఉడు వీర్లపల్లి శంకర్‌ అన్నారు. మండలంలోని ఎల్కగూడెం, పద్మారం, వీరన్నపేట గ్రామాల్లో శనివారం పార్టీ మండల అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. బస్‌చార్జీలు పెంచి పేదవిద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని విమర్శించారు. కార్యక్రమంలో కిసాన్‌ కాంగ్రెస్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రాజు, నాయకులు కృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌, సలీం, రాజా నర్సింహారెడ్డి, సత్యనారాయణరెడ్డి, నర్సింలు, లింగం, యాదగిరిగౌడ్‌, భాస్కర్‌, అన్వర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా కడ్తాల్‌ మండలంలోని ముద్విన్‌ గ్రామంలో శనివారం మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్‌గౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బీక్యనాయక్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి రైతు డిక్లరేషన్‌ కరపత్రాలు అందజేశారు. అదేవిధంగా శంషాబాద్‌ మండలంలోని నానపూజీపూర్‌, రాయన్నగూడలో మండల పార్టీ అధ్యక్షుడు గడ్డం శేఖర్‌యాదవ్‌ అధ్వర్యంలో శనివారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రె్‌సపార్టీ రాజేంద్రనగర్‌ ఇన్‌చార్జి బొర్ర జ్ఞానేశ్వర్‌ముదిరాజ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రైతులను మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసెల్‌ ఉపాఽధ్యక్షుడు జల్‌పల్లి నరేందర్‌, మున్సిపల్‌ వైస్‌ప్రెసిడెంట్‌ జాంగీర్‌ఖాన్‌, కోటీశ్వర్‌గౌడ్‌, మహేందర్‌, ప్రభాకర్‌, ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు ప్రణయ్‌, జిల్లా నాయకురాలు మైలారం సులోచన, ప్రవీణ్‌కుమార్‌, కృష్ణ పాల్గొన్నారు.  

Read more