ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2022-10-14T05:39:25+05:30 IST

ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

కొడంగల్‌/కొడంగల్‌ రూరల్‌/పరిగి/ధారూరు, అక్టోబరు 13: ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. గురువారం కొడంగల్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీ నిర్వహించారు. నెంబర్‌ ప్లేట్లు లేకుండా రోడ్లపై తిరుగుతున్న 13 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలను సీజ్‌ చేసినట్లు ఏఎస్సై బాలకిషన్‌నాయక్‌ తెలిపారు.  అదేవిధంగా పరిగి ఆర్టీసి డిపో దగ్గర పరిగి సీఐ వెంకటరామయ్య, ఎస్‌ఐ విఠల్‌రెడ్డిలు తనిఖీలు చేశారు. నంబరు ప్లేట్‌ సరిగ్గా లేని వాహనాలతోపాటు, త్రిబుల్‌ రైడింగ్‌, సరైనా పత్రాలు లేని 137 వాహనాలను సీజ్‌ చేశారు.  ధారూరులోని కోట్‌పల్లి చౌరస్తాలో గురువారం రాత్రి పోలీసులు నాఖాబందీ నిర్వహించారు. సీఐ తిరుపతిరాజు ఆధ ్వర్యంలో ఎస్‌ఐ నరేందర్‌ పోలీసు సిబ్బంది తాండూర్‌-హైద్రాబాద్‌ రోడ్డు మార్గంలో వాహనాలను ఆపి తనిఖీలు చేశారు.


Read more