ప్రతిఒక్కరూ సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2022-04-24T05:40:44+05:30 IST

ప్రతిఒక్కరూ సమన్వయంతో పనిచేయాలి

ప్రతిఒక్కరూ సమన్వయంతో పనిచేయాలి

దోమ/కులకచర్ల, ఏప్రిల్‌ 23 : ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రతిఒక్కరూ సమన్వయంతో పని చేయాలని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి తెలిపారు. శనివారం దోమ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అనసూయ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. మూడు నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశానికి విద్యుత్‌ ఏఈ హాజరుకాకుండా సిబ్బందిని పంపడంపై పలువురు సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జడ్పీటీసీ నాగిరెడ్డి విద్యుత్‌ ఏడీకి ఫోన్‌చేసి ఏఈ ప్రవర్తన మార్చుకోవాలని సూచించాల్సిందిగా చెప్పారు. దోమ నుంచి ఊటుపల్లి మీదుగా పరిగి వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా ఉందని, మోత్కూర్‌ నుంచి ఐనాపూర్‌ వెళ్లే రోడ్డు ఐనాపూర్‌ సమీపంలో బాగాలేదని సర్పంచ్‌లు సభ దృష్టికి తెచ్చారు. కాగా, మరమ్మతులు ఎప్పుడు చేస్తారని ఆర్‌అండ్‌బీ ఏఈని సర్పంలు రాజిరెడ్డి, కేశవులు నిలదీశారు. కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, జడ్పీటీసీ నాగిరెడ్డి, వైస్‌ఎంపీపీ మల్లేశం, ఎంపీడీవో జయరాం, పీఆర్‌డీఈ ఉమేశ్‌, డీటీ రాజేందర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌ రాజిరెడ్డి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

  • మన ఊరు-మనబడితో పాఠశాలల అభివృద్ధి

మన ఊరు-మనబడి పథకం ద్వారా పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తెలిపారు. శనివారం కులకచర్ల  మండలం సాల్వీడ్‌ గ్రామ ఉన్నత పాఠశాలలో మ్యాజిక్‌ బస్సు స్వచ్ఛంద సంస్థ సహకారంతో కంప్యూటర్‌ తరగతులను, మండల పరిషత్‌ నిధులు రూ.3 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదిని ఆయన ప్రారంభించారు. ఎంపీపీ సత్తెమ్మ, జడ్పీటీసీ రాందా్‌సనాయక్‌, సర్పంచ్‌ బాలయ్య, స్వచ్ఛంద సంస్థ మండల ఇన్‌చార్జి విష్ణు, హెచ్‌ఎంలు స్వయంప్రకాశ్‌, సతీ్‌షకుమార్‌, సొసైటీ డైరెక్టర్‌ కొండయ్యగౌడ్‌ తదితరులున్నారు.

Read more