ఉత్సాహంగా ‘స్వచ్ఛ గురుకుల్‌’

ABN , First Publish Date - 2022-09-10T05:30:00+05:30 IST

ఉత్సాహంగా ‘స్వచ్ఛ గురుకుల్‌’

ఉత్సాహంగా ‘స్వచ్ఛ గురుకుల్‌’

మేడ్చల్‌/శామీర్‌పేట, సెప్టెంబర్‌ 10 : స్వచ్ఛ గురుకుల్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం మేడ్చల్‌ మున్సిపల్‌ కిష్టాపూర్‌ పరిధిలో గల సాంఘిక సంక్షేమ పాఠశాలలో పరిశుభ్రతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్‌మాబ్‌ ఆకట్టుకుంది. పరిశుభ్రత అవగాహనపై విద్యార్థులు స్కిట్లు, నృత్యాలు, నాటికలు, పాడిన పాటలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే విజ్ఞాన జ్యోతుల వెలుగులో మనిషి తనను తాను తీర్చిదిద్దుకోవాలని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఇష్రత్‌ ఆకాంక్షించారు. స్వచ్ఛ గురుకుల్‌ కార్యకమ్రంలో భాగంగా శామీర్‌పేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల(జగద్గిరిగుట్ట)లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పోస్టర్‌ ప్రదర్శన, నినాదాలు, ఫ్లాష్‌మాబ్‌ ప్రదర్శించారు.


Read more