‘ఉపాధిహామీ’ డబ్బులు చెల్లించాలి

ABN , First Publish Date - 2022-03-17T05:21:29+05:30 IST

‘ఉపాధిహామీ’ డబ్బులు చెల్లించాలి

‘ఉపాధిహామీ’ డబ్బులు చెల్లించాలి
దౌల్తాబాద్‌ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధి కూలీలు

దౌల్తాబాద్‌, మార్చి 16: ఉపాధిహామీ పథకంలో భాగంగా పనులు చేసిన కూలీలకు డబ్బులు చెల్లించాలని బుధవారం కూలీలు ధర్నా నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట వారు ధర్నా నిర్వహించి మాట్లాడారు. పనులు చేసి నెల రోజులు గడుస్తున్నా.. కూలీ డబ్బులు అందించడంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయారు. ఇప్పటికైనా తమ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్‌ను విధుల్లోంచి తొలగించాలని కూలీలు డిమాండ్‌ చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు.

Read more