సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-11-19T00:15:22+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారానికే శుభోదయం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి  : ఎమ్మెల్యే

నవాబుపేట, నవంబరు 18: ప్రజా సమస్యల పరిష్కారానికే శుభోదయం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం నవాబుపేట మండలం నారేగూడ, పూలపల్లిలో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పూలపల్లిలో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నవాబుపేట్‌ మండలానికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సర్పంచ్‌లు నర్సింహారెడ్డి, హన్మయ్య, తలారి అజయ్‌కుమార్‌, ఎంపీపీ కాలె భవానీ, జడ్పీటీసీ కాలె జయమ్మ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రశాంత్‌గౌడ్‌, డైరెక్టర్‌ విఠల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు రంగారెడ్డి, డెక్క మానయ్య, శాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:15:22+05:30 IST

Read more