మైనార్టీల సంక్షేమానికి కృషి

ABN , First Publish Date - 2022-04-24T05:30:00+05:30 IST

మైనార్టీల సంక్షేమానికి కృషి

మైనార్టీల సంక్షేమానికి కృషి
రంజాన్‌ తోఫా పంపిణీ చేస్తున్న మంత్రి, ఎమ్మెల్యే


  • విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఆమనగల్ల్లు, ఏప్రిల్‌24 : మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కడ్తాల మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్‌లో ఆదివారం మైనార్టీ జిల్లా నాయకుడు, కందుకూరు మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యులు హైమద్‌ జానీ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితాఇంద్రారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ ముస్లింల ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సిరాజ్‌ రహిమాన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రంజాన్‌ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించిన రంజాన్‌ కిట్లను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాతుతూ రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యమిస్తూ వారి పండుగలకు కానుకలు అందజేస్తుందని తెలిపారు. అదేవిధంగా ఇఫ్తార్‌ విందులు మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం  అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు రూపొందించి అమలు చేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ విజన్‌తో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సిరాజ్‌ రహిమాన్‌ మాట్లాడుతూ కులం, మతం కంటే మానవత్వం గొప్పదని అన్నారు. అన్ని మతాల సారాంశం అదేనని తెలిపారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ మాట్లాడుతూ మైనార్టీలకు గుర్తింపును ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసి దశరత్‌ నాయక్‌, అనురాధ పత్యానాయక్‌, జంగారెడ్డి, డీసీసీబీ డైరక్టర్‌ గంప వెంకటేష్‌, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, కోఆప్షన్‌ సభ్యులు జాంగీర్‌బాబా, నాయకులు గోపాల్‌, కుమార్‌, రమేష్‌, జాంగీర్‌ అలీ, లాయక్‌ అలీ, రావూస్‌, జానీమియా, జావిద్‌, పరమేష్‌, వీరయ్య, హిరంషద్‌, అంజి పాల్గొన్నారు.

Read more