క్రీడామైదానాల అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-11-28T00:05:01+05:30 IST

చేవెళ్ల నియోజకవర్గంలో క్రీడా మైదానాల అభివృద్ధికి కృషి చేస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.

క్రీడామైదానాల అభివృద్ధికి కృషి
విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యే యాదయ్య

చేవెళ్ల, నవంబరు 27: చేవెళ్ల నియోజకవర్గంలో క్రీడా మైదానాల అభివృద్ధికి కృషి చేస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలో జడ్పీహెచ్‌ఎస్‌ 1981-82 పదో తరగతి బ్యాచ్‌ ఆధ్వర్యంలో ఎం.ప్రభాకర్‌రెడ్డి మోమోరియల్‌ టోర్నమెంట్‌ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఆదివారం క్రికెట్‌ టోర్నమెంట్‌ ముగింపు నేపథ్యంలో ఇరుజట్ల మధ్య పోటీ ఉత్కంఠ భరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరయ్యారు. కాగా ఫైనాల్‌ టోర్నోమెంట్‌లో చేవెళ్ల జట్టుపై మొయినాబాద్‌ మండలం రెడ్డిపల్లి జట్టు విజయం సాధించింది. గెలుపొందిన క్రీడాకారులకు షీల్డ్‌తోపాటు విన్నర్‌కు రూ.66,666. రన్నర్‌కు రూ.33,333 నగదును చేవెళ్ల సర్పంచ్‌ బండారు శైలజాఆగిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవర వెంకట్‌రెడ్డిలు సమకూర్చగా ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేవెళ్ల మండలంలో అసంపూర్తిగా ఉన్న స్టేడియాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తామన్నారు. మొయినాబాద్‌ మండల కేంద్రంలో క్రీడాకారుల కోసం స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకట్‌స్వామి, కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం, దళిత రత్న అవార్డు గ్రహీత బురాన్‌ ప్రభాకర్‌, చేవెళ్ల పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవర వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ ఎం.మాలతి, ఎంపీపీ ఎం.విజయలక్ష్మి, సర్పంచులు బండారి శైలజ, వెంకటేశంగుప్తా, రెడ్డిపల్లి ఎంపీటీసీ మోర శ్రీనివాస్‌, చేవెళ్ల ఉపసర్పంచ్‌ గంగి యాదయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి, సీనియర్‌ నాయకులు రమణారెడ్డి, ఆగిరెడ్డి, శ్రీనివాస్‌, ఇందిర, దేవర సమాతరెడ్డి, బాలయ్య, శర్వలింగం, సత్యనారాయణగౌడ్‌, నర్సింలు, యాదయ్యగౌడ్‌, విజయ్‌, అనంత్‌రెడ్డి, రఘుపతిరెడ్డి ఉన్నారు.

Updated Date - 2022-11-28T00:05:02+05:30 IST