ఎమ్మెల్యేపై నోరు పారేసుకోవద్దు

ABN , First Publish Date - 2022-04-25T05:25:05+05:30 IST

ఎమ్మెల్యేపై నోరు పారేసుకోవద్దు

ఎమ్మెల్యేపై నోరు పారేసుకోవద్దు
సమావేశంలో మాట్లాడుతున్నశ్రీనివా్‌సయాదవ్‌


  • టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివా్‌సయాదవ్‌

పెద్దేముల్‌, ఏప్రిల్‌ 24 : ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి గురించి నోరు పారేసుకుంటే నాలుక చీరేస్తామని టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు కోహిర్‌ శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీటీసీ ఎవరూ లేకుండానే..పార్టీ నాయకుల చేత కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయించారని, ప్రజాప్రతినిధులను అవమానించారని జడ్పీటీసీ ధారాసింగ్‌ అదేరోజు విలేకరుల సమావేశంలో ఆరోపించారని, రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యేపై విమర్శలు చేశారని అన్నారు. కాగా, మండల పరిషత్‌మాజీ ఉపాధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి రంగయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకట్‌రెడ్డి, కృష్ణగౌడ్‌, డీవై.ప్రసాద్‌, శిబ్లి తదితరులతో కలిసి ఆయన ఆదివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. కోహిర్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యేను విమర్శించే హక్కు ధారాసింగ్‌కు లేదని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి ఎన్ని పనులు చేయించుకున్నారో గుర్తు చేసుకోవాలన్నారు. ఎవరిదో మెప్పు పొందడానికి ఎమ్మెల్యేను విమర్శిస్తే తాము ఊరుకోమని చెప్పారు. ఏ అధికారికి ఎన్ని లక్షలు ఇచ్చావో ఆధారాలు చూపిస్తే ఎమ్మెల్యేకు చెప్పి ఆ అధికారిని సస్పెండ్‌ చేయిస్తామని అన్నారు. 

Read more