ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని ధర్నా

ABN , First Publish Date - 2022-11-23T23:32:32+05:30 IST

తమ గ్రామానికి రద్దు చేసిన ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని ధర్నా
రోడ్డుపై ధర్నా చేస్తున్న విద్యార్థులు

షాద్‌నగర్‌ రూరల్‌, నవంబరు 23: తమ గ్రామానికి రద్దు చేసిన ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని ఫరూఖ్‌నగర్‌ మండలం చింతగూడ గ్రామానికి చెందిన విద్యార్థులు బుధవారం బూర్గులరోడ్డుపై కాశిరెడ్డిగూడ గ్రామం వద్ద ధర్నా చేశారు. లాక్‌డౌన్‌ నుంచి తమ గ్రామానికి సక్రమంగా బస్సు నడపడం లేదని అన్నారు. డీఎం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యార్థుల ధర్నాకు వైస్‌ఎంపీపీ మౌనిక, సర్పంచ్‌ కల్పన రాము, మాజీ సర్పంచ్‌ ఆనంద్‌, సీపీఎం నాయకులు శ్రీనునాయక్‌ మద్దతు తెలిపారు. అక్కడి నుంచి అదే బస్సులో షాద్‌నగర్‌ డిపోకు వచ్చి డీఎంతో చర్చించారు. పరిశీలించి బస్సు వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Updated Date - 2022-11-23T23:32:32+05:30 IST

Read more