కాంగ్రెస్‌ హయాంలోనే అభివృద్ధి

ABN , First Publish Date - 2022-08-10T05:46:11+05:30 IST

కాంగ్రెస్‌ హయాంలోనే అభివృద్ధి

కాంగ్రెస్‌ హయాంలోనే అభివృద్ధి
పాదయాత్రలో మాట్లాడుతున్న వీర్లపల్లి శంకర్‌

కొందుర్గు, ఆగస్టు, 9: దేశం, రాష్ట్రం అన్ని రంగాల్లో కాంగ్రెస్‌ ప్ర భుత్వాల హాయాంలోనే అభివృద్ధి చెందాయని షాద్‌నగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి వీర్లపల్లి శంకర్‌ అన్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన స్వాతంత్య్ర సమరయోధుల జ్ఞాపకార్థ పాదయాత్రను ఆయన మంగళవారం జిల్లేడ్‌-చౌదర్‌గూడ మండల పరిధిలోని వాచ్యా తాండలో ప్రారంభించారు. అక్కడి నుంచి గాలిగూడెం, పెద్దఎల్కిచర్ల, వీరన్నపేట్‌, పద్మారం, ఎల్కగూడెం మీదుగా చౌదర్‌గూడ వరకు పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా చౌదర్‌గూడలో శంకర్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన పార్టీ కాంగ్రెస్‌ అని, ఎంతో మంది త్యాగాలతో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని వివరించారు. స్వాతంత్య్ర సాధన లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యపాత్ర వహించిందని అన్నారు. స్వాత ంత్య్రం తెచ్చిన సమరయోధులను మరిచిపోవడం భావ్యం కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని విమర్శించారు. పాదయాత్రలో పార్టీ మం డల అధ్యక్షుడు చలివేంద్రంపల్లి రాజు, బాబర్‌ఖాన్‌, చిల్కమర్రి నర్సింలు, జితేందర్‌రెడ్డి, నరేందర్‌, శేఖర్‌, చంద్రశేఖర్‌, రాజా నర్సి ంహారెడ్డి, మల్లే్‌షగౌడ్‌, వెంకటయ్య, నర్సింలు, వేణుగోపాల్‌, అంజనేయులు, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read more