పట్టణాలకు ధీటుగా పల్లెల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-11-19T00:04:31+05:30 IST

గ్రామాల అభివృద్ధి, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు

పట్టణాలకు ధీటుగా పల్లెల అభివృద్ధి
ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌

కడ్తాల్‌, నవంబరు 18: గ్రామాల అభివృద్ధి, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాలకు ధీటుగా గ్రామాలు, తండాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. కడ్తాల మండలం రావిచెడ్‌లో శుక్రవారం ఎమ్మెల్యే పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామ ంలో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా గ్రామంలో నిర్వహించిన చెన్నమ్మ సంస్మరణ కార్యక్రమంలో జైపాల్‌యాదవ్‌ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేశారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలంతా పాలుపంచుకోవాలని ఆయన సూచించారు. వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటూ మద్దతు ఇస్తోంద న్నారు. కేంద్ర ప్రభుత్వం రైతువ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని జైపాల్‌ మండిపడ్డారు. అభివృ ద్ధి కార్యక్రమాల్లో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచి ందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గోపాల్‌, బాలకృష్ణ, రమేశ్‌, పవన్‌, లింగం, బిక్షపతి, కృష్ణ, రమేశ్‌, సాయికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:04:31+05:30 IST

Read more