కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2022-10-12T05:13:49+05:30 IST

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

వికారాబాద్‌, అక్టోబరు 11 : కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం కోట్‌పల్లి మండలం బిరెళ్లి గ్రామానికి చెందిన ఆయా పార్టీల నాయకులు ప్రసాద్‌ కుమార్‌ నివాసంలో ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈసందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రసాద్‌ కుమార్‌కు తమ గ్రామంలో భారీ మొజారిటీ వచ్చేలా కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ నర్సిములు, పార్టీలో చేరిన వారు అనిల్‌, మహేందర్‌, మహేందర్‌, రాకేష్‌, సంజయ్‌, అనంతయ్య, అశోక్‌, రమేష్‌, సుదర్శన్‌, సందీప్‌, రాంచంద్రయ్య, కిష్టయ్య, ప్రణవ్‌, మహేందర్‌, మహేందర్‌, లక్ష్మీణ్‌, జలందర్‌, హరిప్రసాద్‌, శివ ప్రసాద్‌, సుధాకర్‌ తదితరులు ఉన్నారు.


Read more