-
-
Home » Telangana » Rangareddy » Details of children and pregnant women should be linked to Aadhaar-MRGS-Telangana
-
చిన్నారులు, గర్భిణుల వివరాలను ఆధార్‌కు అనుసంధానం చేయాలి
ABN , First Publish Date - 2022-09-14T05:15:46+05:30 IST
చిన్నారులు, గర్భిణుల వివరాలను ఆధార్‌కు అనుసంధానం చేయాలి

తాండూరు రూరల్, సెప్టెంబరు 13 : తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల, తాండూరు, పెద్దేముల్, తాండూరు పట్టణంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతల సమగ్ర వివరాలను ఆధార్‌కు అనుసంధానం చేయాలని ఐసీడీఎస్ సీడీపీవో రేణుక పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో తాండూరు ఐసీడీఎస్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు, సూపర్‌వైజర్లతో ఆధార్ అనుసంధానంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాండూరు నియోజకవర్గంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు మొత్తం 17,258 మంది ఉన్నారని, ఇప్పటివరకు 7,200 మంది వివరాలు మాత్రమే ఆధార్‌కు అనుసంధానం చేశారని తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లు ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వీలైనంత త్వరగా ఆధార్ అనుసంధానం పూర్తిచేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.