చిలుకూరులో ప్రదక్షణలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-12T23:14:31+05:30 IST

చిలుకూరు బాలాజీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ప్రదక్షణలు ప్రారంభమయ్యాయి.

చిలుకూరులో ప్రదక్షణలు ప్రారంభం
చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రదక్షణలు చేస్తున్న భక్తులు

మొయినాబాద్‌ రూరల్‌, డిసెంబరు12: చిలుకూరు బాలాజీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ప్రదక్షణలు ప్రారంభమయ్యాయి. కరోనా లాక్‌డౌన్‌ నుంచి దాదాపు రెండేళ్లుగా ప్రదక్షణలను నిలిపివేశారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు దేవాలయం బయటనుంచే మహాప్రదక్షణలు చేసుకున్నారు. 108 మొక్కు ఉన్నవారు 11 తిరగాలని.. 11 మొక్కు ఉన్నవారు 1 ప్రదక్షిణ చేస్తే సరిపోతుందని అప్పట్లో ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్‌ రంగరాజన్‌ ప్రకటించారు. తాజాగా ఆలయం ఆవరణలో నుంచి భక్తులకు ప్రదక్షిణలకు అనుమతించారు. చాలారోజుల తర్వాత ప్రదక్షణలు ప్రారంభం కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు గోవిందా నామస్మరణతో మార్మోగాయి. సోమ, మంగళ, బుధు, గురువారాల్లో ప్రదక్షణలకు భక్తులను అనుమతించినట్లు అర్చకులు తెలిపారు.

Updated Date - 2022-12-12T23:14:31+05:30 IST

Read more