మోసం కేసులో నిందితుడి రిమాండ్‌

ABN , First Publish Date - 2022-02-20T05:10:31+05:30 IST

మోసం కేసులో నిందితుడి రిమాండ్‌

మోసం కేసులో నిందితుడి రిమాండ్‌

తాండూరు రూరల్‌, ఫిబ్రవరి 19 : తాండూరు మండలం జినుగుర్తి తండాకు చెందిన ఓ గిరిజన మహిళను మాయమాటలతో మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందని తాండూరు రూరల్‌ సీఐ జలందర్‌రెడ్డి, ఎస్‌ఐ మధుసూదనరెడ్డిలు తెలిపారు. దోమ మండలం మేడిపల్లితండాకు చెందిన విస్లావత్‌ సాగర్‌ గత మూడేళ్లుగా జినుగుర్తి తండాకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఈనెల 10న మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన అమ్మాయి కుటుంబీకులు గురువారం ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిపై 376, 417, 406 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందని ఎస్‌ఐ మధుసూదనరెడ్డి తెలిపారు.

Read more