రోడ్డు ప్రమాదంలో జింక మృత్యువాత

ABN , First Publish Date - 2022-10-12T05:12:48+05:30 IST

రోడ్డు ప్రమాదంలో జింక మృత్యువాత

రోడ్డు ప్రమాదంలో జింక మృత్యువాత

కడ్తాల్‌, అక్టోబరు 11: రోడ్డు ప్రమాదంలో గాయపడి జింక మృత్యువాతపడిన సంఘటన మైసిగండి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. మండలంలోని మైసిగండి అటవీ ప్రాంతం నుంచి జింక రోడ్డు దాడుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జింకను గమనించిన స్థానికులు సర్పంచ్‌ తులసీరామ్‌, జడ్పీటీసీ దశరథ్‌ నాయక్‌లకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకొని జింకను పరిశీలించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గాయపడ్డ జింకను అటవీ శాఖ అధికారులు ఆమనగల్లు ప్రభుత్వ పశువైద్య శాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎఫ్‌ఆర్‌వో కమాలొద్దీన్‌ తెలిపారు. స్థానిక ప్రభుత్వ పశువైద్యశాలలో జింకకు పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎఫ్‌ఆర్‌వో తెలిపారు.

Read more