ఫొటోగ్రాఫర్‌ మృతికి సంతాపం

ABN , First Publish Date - 2022-11-30T23:50:46+05:30 IST

ఆమనగల్లులో నివాసముండే నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం రాఘాయిపల్లికి చెందిన శవ్వ మల్లేశ్‌ అనే ఫొటోగ్రాఫర్‌ మంగళవారం రాత్రి కందుకూరు మండలంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు.

ఫొటోగ్రాఫర్‌ మృతికి సంతాపం
సంతాపం వ్యక్తం చేస్తున్న ఫొటోగ్రాఫర్లు

ఆమనగల్లు, నవంబరు 30: ఆమనగల్లులో నివాసముండే నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం రాఘాయిపల్లికి చెందిన శవ్వ మల్లేశ్‌ అనే ఫొటోగ్రాఫర్‌ మంగళవారం రాత్రి కందుకూరు మండలంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. మల్లేశ్‌ మృతిపట్ల ఆమనగల్లు ఫొటో, వీడియోగ్రాఫర్ల సంఘం నాయకులు సంతాపం తెలిపారు. బుధవారం బస్టాండ్‌ కూడలిలో మల్లేశ్‌ చిత్రపటానికి పూలమాలలు వేశారు. సంతాప సూచికంగా ఫొటోస్టూడియోలను మూసి ఉంచారు. మల్లేశ్‌ కుటుంబాన్ని ప్రభుత్వ ఆదుకోవాలని కోరారు. సత్యం, పాషా, జబ్జార్‌, గణేశ్‌, నర్సింహ, అలీం, గిరి, ఖలీం, జావెద్‌, వెంకటేశ్‌, బాబ, శేఖర్‌, చందు, శ్రీకాంత్‌, ఫరీద్‌, శివ,మహేశ్‌, రఫీ,ప్రవీణ్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2022-11-30T23:50:46+05:30 IST

Read more