-
-
Home » Telangana » Rangareddy » Dayakar Reddy has been appointed as the Chairman of the Medchal District Library Association-MRGS-Telangana
-
మేడ్చల్ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌గా దయాకర్‌రెడ్డి నియామకం
ABN , First Publish Date - 2022-10-12T04:20:52+05:30 IST
మేడ్చల్ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌గా దయాకర్‌రెడ్డి నియామకం

మేడ్చల్ అక్టోబర్ 11(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌గా ఫీర్జాదిగూడకు చెందిన దర్గా దయాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి చేతులమీదుగా నియామక పత్రం అందుకున్నారు. అనంతరం ఆయన మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు దయాకర్‌రెడ్డిని శాలువాలతో సత్కరించి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలియజేశారు.