-
-
Home » Telangana » Rangareddy » Damaged crops should be compensated-MRGS-Telangana
-
దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-09-12T04:57:51+05:30 IST
దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలి

పూడూర్, సెప్టెంబరు, 11: మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలని సీపీఐ వికారాబాద్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు సిహెచ్.బుచ్చన్న ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇటీవలే కురిసిన అకాల వర్షాలతో రైతులు సాగు చేసిన కంది, పత్తి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రైతులకు పంట నష్టపరిహారం ఎకరాకు రూ.30వేలు ఇవ్వాలన్నారు. పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచి ఉండటంతో సాగు కోసం ఖర్చు చేసిన వేలాది రూపాయలు నష్టపోయామని రైతులు లబోదిబోమంటున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి ఆదుకోవాలన్నారు.