కర్రంట్‌ స్తంభాలు

ABN , First Publish Date - 2022-08-18T04:41:51+05:30 IST

తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో కరెంట్‌ కష్టాలు తీవ్రమయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు లేక కర్రల ఆధారంగా విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. మధ్యమధ్యలో గాలి దుమారానికి కర్ర కింద పడడంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కర్రంట్‌ స్తంభాలు
మోడల్‌ స్కూల్‌కు కరెంట్‌ సరఫరాకు పాతిన కర్ర కిందపడటంతో పైకి లేపి కడుతున్న సిబ్బంది

  •  విద్యుత్‌ సరఫరాకు అంతరాయం 
  •  గాలి దుమారానికి పడిపోతున్న కర్రలు
  • నీటి సరఫరా, డిజిటల్‌ క్లాస్‌లకు తప్పని ఇబ్బందులు
  •  మోడల్‌ స్కూల్‌లో కరెంట్‌ కష్టాలు
  •  పట్టించుకోని సంబంధిత అధికారులు

  • బషీరాబాద్‌, ఆగస్టు17: తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో కరెంట్‌ కష్టాలు తీవ్రమయ్యాయి.  విద్యుత్‌ స్తంభాలు లేక  కర్రల ఆధారంగా విద్యుత్‌ సరఫరా జరుగుతోంది.  మధ్యమధ్యలో గాలి దుమారానికి  కర్ర కింద పడడంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బషీరాబాద్‌ మండలంలోని ఇందర్‌చెడ్‌ రోడ్డు మార్గంలో తెలంగాణ మోడల్‌ స్కూల్‌ను 2016లో ప్రారంభించారు. అప్పట్లో భవనం నిర్మాణం జరిగే సమయంలో కరెంట్‌ సరఫరా కోసం ప్రత్యేక లైన్‌ తీసుకున్నప్పటికీ స్కూల్‌కు ఆర కిలోమీటర్‌ దూరంలో విద్యుత్‌ అధికారులు స్తంభాలు వేసి వదిలేశారు. స్కూల్‌ ప్రారంభ సమయంలో అక్కడి స్తంభం నుంచి మధ్యలో కర్రలు పాతి భవనానికి సర్వీ్‌సవైర్‌ ద్వారా కరెంట్‌ కనెక్షన్‌ ఇచ్చారు. ఇంతకాలం సుదూర ప్రాంతం నుంచి సర్వీస్‌ వైర్‌తోనే విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. దీంతో సర్వీ్‌సవైర్‌పై లోడ్‌ పడటం, లో ఓల్టేజీతో ఫ్యాన్లు, బోరు మోటారు కాలిపోవడం, డిజిటల్‌ క్లాస్‌లు నిర్వహించే సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడి ఇబ్బందులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కర్రల ఆధారంగా సర్వీ్‌సవైర్‌ స్కూల్‌ వరకు ఉండటంతో ప్రతిసారి వర్షాలు, గాలిదూమరానికి కర్రలు కింద పడటం, పైకి లేపి మళ్లీ కట్టడం, వైర్లు కాలిపోవడం నిత్యకృత్యమైందన్నారు. ఈ విషయమై మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ జహాంగీర్‌ను అడుగగా కరెంట్‌ సమస్యపై మొరపెట్టుకోగా గతంలో ఆశాఖ అధికారులు రెండు స్తంభాలు పాతి అలాగే వదిలేశారన్నారు. మరో స్తంభం ఏర్పాటు చేసి కేబుల్‌ లేదా కండక్టర్‌ వైర్‌ లాగితే కరెంట్‌ కష్టాలు తొలగిపోతాయన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కంచాలని కోరారు. 

Read more