కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-09-10T06:01:05+05:30 IST

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం

యాచారం, సెప్టెంబరు 9: కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఘటన యాచారం మండలం కుర్మిద్ద గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మంచాల మండలంలోని చెన్నారెడ్డిగూడ గ్రామానికి చెందిన లతతో కుర్మిద్దకు చెందిన వెంకటేశ్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. కాగా ఈ దంపతుల మధ్య రెండు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం మళ్లీ గొడవ జరగగా భార్యాభర్తలిద్దరూ ఒంటిపై శానిటైజర్‌ పోసుకొని నిప్పంటించుకున్నారు. వీరిని గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇరువురికి 25శాతం కాలిన గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య చెప్పారు. 

Read more