సహకార రుణాలు వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2022-10-01T05:53:22+05:30 IST

సహకార రుణాలు వినియోగించుకోవాలి

సహకార రుణాలు వినియోగించుకోవాలి
రైతులకు రుణాలు అందజేస్తున్న పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి

చేవెళ్ల, సెప్టెంబరు 30: సహకార సంఘం ద్వారా ఇస్తున్న రుణాలను  రైతులు వినియోగించుకోవాలని చేవెళ్ల పీఏసీఎస్‌ చైర్మెన్‌ దేవర వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల సహకార సొసైటీ కార్యాలయంలో సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సొసైటీ ఆధ్వర్యంలో కొత్తగా 34మంది రైతులకు రూ.23లక్షలు రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్‌ వైఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌, డైరెక్టర్లు దామోదర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నర్సింలు,  కార్యదర్శి వెంకటయ్య, రైతులు ఉన్నారు.  

Read more