-
-
Home » Telangana » Rangareddy » Conspiracies of religious forces should be reversed-NGTS-Telangana
-
మతతత్వ శక్తుల కుట్రలను తిప్పికొట్టాలి
ABN , First Publish Date - 2022-09-19T05:44:39+05:30 IST
మతతత్వ శక్తుల కుట్రలను తిప్పికొట్టాలి

ఆమనగల్లు, సెప్టెంబరు 18: రాష్ట్రంలో మతతత్వ శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఎంపీటీసీ బండెల సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సమక్షంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు ఆమనగల్లు మార్కెట్‌చైర్మన్ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు సీఎల్ శ్రీనివా్‌సయాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమ్మరి శంకర్, రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు పద్మ నర్సింహలతో కలిసి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ గులాబికండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. టీఆర్ఎస్ మాడ్గుల మండల అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్‌రెడ్డి, దశరథ్‌నాయక్, జంగయ్య, శేఖర్, రవీందర్‌రెడ్డి, శ్యామ్‌సుందర్ రెడ్డి, శేఖర్ యాదవ్, మల్లేశ్, రాములు పాల్గొన్నారు.