రైతు డిక్లరేషన్‌తో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం ఖాయం

ABN , First Publish Date - 2022-06-07T05:38:17+05:30 IST

రైతు డిక్లరేషన్‌తో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం ఖాయం

రైతు డిక్లరేషన్‌తో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం ఖాయం
మంతట్టిలో మాట్లాడుతున్న పీసీసీ ఉపాధ్యక్షుడు ఎ.రమేష్‌

బషీరాబాద్‌, జూన్‌ 6: కాంగ్రెస్‌ పాలనతోనే పేదలకు న్యాయం జరగుతుందని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్‌ అన్నారు. సోమవారం కాంగ్రెస్‌ రచ్చబండలో భాగంగా మంతట్టి, మల్కన్‌గిరి, కాశీంపూర్‌, కుప్పన్‌కోట్‌, బద్లాపూర్‌, బద్లాపూర్‌తండాలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ రైతు డిక్లరేషన్‌తో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని, తమ ప్రభుత్వం వెంటనే హామీని అమలు చేస్తుందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్‌ మోసపూరిత, మాయమాటలతో పాలనచేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే ఒకేసారి రైతులకు రూ.2లక్షల రుణమాఫీతో చేస్తుందన్నారు. పెట్టుబడికి ఎకరాకు రూ.15వేలు ఇస్తామన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తాండూరులో చేసిన అభివృద్ధి శూన్యంమన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జి.మాధవరెడ్డి, ధారాసింగ్‌, మల్కపూరం జనార్ధన్‌రెడ్డి, ఉత్తంచంద్‌, వెంకట్‌,  నర్సింహులుగౌడ్‌, అనిల్‌కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు. మల్కన్‌గిరిలో రిటైర్డ్‌ ఎస్‌ఐ చంద్రయ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనకు ఎం.రమేష్‌ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.

Updated Date - 2022-06-07T05:38:17+05:30 IST