పోటాపోటీగా లడ్డూల వేలం

ABN , First Publish Date - 2022-09-09T05:05:06+05:30 IST

గణపయ్య లడ్డూ వేలం కడ్తాల మండలం మైసిగండి గ్రామంలో

పోటాపోటీగా లడ్డూల వేలం
కడ్తాల : మైసిగండిలో వినాయకుడి శోభాయాత్ర

కడ్తాల్‌, సెప్టెంబరు 8: గణపయ్య లడ్డూ వేలం కడ్తాల మండలం మైసిగండి గ్రామంలో పోటా పోటీగా కొనసాగాయి. వినాయక నవరాత్రోత్సవాలలో భాగంగా మైసిగండి గ్రామంలో ఏర్పాటు చేసిన వివిద వినాయక మండపాల వద్ద గురువారం నిమజ్జనం నేపథ్యంలో లడ్డు వేలం పాటలు నిర్వహించారు. మైసిగండి గణేశ్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్‌ కూడలిలో ఏర్పాటు చేసిన పెద్ద వినాయకుడి మండపం వద్ద రూ.4లక్షలకు వేలంలో లడ్డూను సభావట్‌ రవి సొంతం చేసుకున్నారు. మిగతా మండపాల వద్ద లడ్డూ వేలం పాటలు పోటాపోటీ సాగాయి. అనంతరం మండపాల వద్ద ఉట్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం వినాయకుల భారీ ఊరేగింపుతో స్థానిక శివాలయం కోనేరులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, సర్పంచ్‌ తులసీరామ్‌ నాయక్‌, ఉప సర్పంచ్‌ రాజారామ్‌ నాయక్‌, ఉత్సవ కమిటీ చైర్మన్‌ హీరాసింగ్‌, నాయకులు జవహార్‌లాల్‌ నాయక్‌, రాము నాయక్‌, హర్యనాయక్‌, దూద్యనాయక్‌, తులసీరామ్‌ , కిషన్‌, రాందాస్‌ నాయక్‌, రమేశ్‌, సక్రి, యాదగిరి గౌడ్‌, రెడ్యనాయక్‌, బాబు, లక్ష్మణ్‌, అమృనాయక్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-09-09T05:05:06+05:30 IST