నీట మునిగిన సాగు భూములకు పరిహారమివ్వాలి

ABN , First Publish Date - 2022-10-13T05:03:55+05:30 IST

ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో నీట మునిగిన పంట పొలాలకు

నీట మునిగిన సాగు భూములకు పరిహారమివ్వాలి
నీట మునిగిన పంట చేనువద్ద రైతులు

ఇబ్రహీంపట్నం, అక్టోబరు 12: ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో నీట మునిగిన పంట పొలాలకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు సీఎం కేసీఆర్‌కు బుధవారం లేఖ రాశారు. ఇబ్రహీంపట్నం చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతున్నందున పట్టా భూములు (ఎఫ్‌టీఎల్‌లో) నీటమునిగి సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఉప్పరిగూడ, పోచారం, చెర్లపటేల్‌గూడ, కర్నంగూడ గ్రామాల రైతులు ఆ లేఖలో పేర్కొన్నారు. 600మంది రైతుల జీవనాధారమైన పంట పొలాలు నీట మునగడంతో దిక్కుతోచని స్థితి ఏర్పడిందని వాపోయారు. గతంలో చెరువు నిండినప్పుడు ఆయకట్టుకు నీరు విడుదల చేసేవారని, దీంతో పొలాలు తేలినకొద్దీ సాగు చేసుకుని పంటలు పండించుకునేవారమని గుర్తు చేశారు. పైగా నీటిని విడుదల చేయడం వలన 1200 ఎకరాల ఆయకట్టు తడిసి పంటలు పండేవని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఒకవేళ తూములు తీసి ఆయకట్టుకు నీరు వదిలే పరిస్థితి లేనప్పుడు తమకు పరిహారం ఇప్పించాలని కోరారు. సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు, ఉప్పరిగూడ సర్పంచ్‌ బూడిద రాంరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ విషయం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, ఇరిగేషన్‌ ఉన్నతాధికారులకు నివేదించామని, ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు.Read more