మేడ్చల్‌ పీఏసీఎస్‌ పాలకవర్గంలో కోల్డ్‌వార్‌!

ABN , First Publish Date - 2022-10-14T05:39:07+05:30 IST

మేడ్చల్‌ పీఏసీఎస్‌ పాలకవర్గంలో కోల్డ్‌వార్‌!

మేడ్చల్‌ పీఏసీఎస్‌ పాలకవర్గంలో కోల్డ్‌వార్‌!

  • సర్వసభ్య సమావేశానికి హాజరుకాని డైరెక్టర్లు

మేడ్చల్‌  అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మేడ్చల్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం నడుమ కోల్డ్‌వార్‌ జరుగుతోంది. గురువారం మేడ ్చల్‌ పట్టణంలోని మేడ్చల్‌ పీఏసీఎస్‌ కార్యాలయంలో చైర్మన్‌ రణ దీప్‌రెడ్డి అధ్యక్షతన సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈక్రమంలో సగానికిపైగా డైరెక్టర్లు రాత్రికిరాత్రే శ్రీశైలం టూర్‌కు వెళ్లిపోయారు. సొసైటీలో 13 మంది డైరెక్టర్లుండగా.. అందులో 8మంది సమావేశానికి గైర్హాజరయ్యారు. సొసైటీ పరిధిలోని రైతులు సమావేశానికి హాజరైనప్పటికీ డైరెక్టర్లు రాకపోవడంతో ఉదయం 11 గంటల వరకు వేచిచూసి సమావేశం ప్రారంభించారు. సొసైటీలో ఏం జరుగుతుందో అర్థం కాక రైతులు మిన్నుకుండిపోయారు. సొసైటీ చైర్మన్‌ రణదీ్‌పరెడ్డి పోకడ నచ్చకనే తాము సమావేశానికి రాలేకపోయామని గైర్హాజరైన డైరెకర్లు చెబుతుండగా, డైరెక్టర్ల గొంతె మ్మ కోరికలు తానెలా తీర్చాలని చైర్మన్‌ వాపోవడం కొసమెరుపు.


Read more