సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం

ABN , First Publish Date - 2022-10-01T05:52:37+05:30 IST

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం
చెక్కును అందజేస్తున్న జడ్పీటీసీ జంగారెడ్డి

కందుకూరు, సెప్టెంబరు 30: సీఎంఆర్‌ఎఫ్‌ పే దలకు వరమని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నా రు. మండలం లోని పలు గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీప్‌ ఫండ్‌ చెక్కులను శుక్రవారం తన చాంబర్‌లో అందజేశారు. వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తం రూ.3లక్షలా 68వేలు విలువ గల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.లక్ష్మీనర్సింహారెడ్డి, చిర్ర సాయిలు, అనేగౌని దామోదర్‌గౌడ్‌, తాళ్ల కార్తీక్‌, జి.సామయ్య, జి.సత్యనారాయణరెడ్డి, రాజు, కాకి నర్సింహ, అందుగుల సత్యనారాయణ,  పాల్గొన్నారు. అదేవిధంగా రాచులూరు పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఆశావర్కర్లకు రాష్ట్రప్రభుత్వం పంపిణీ చేసిన చీరలను శుక్రవారం ఎంపీపీ మంద జ్యోతి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ హరినాథ్‌, సిబ్బంది హసన్‌, మోహినుద్దీన్‌, సత్యనారాయణ, స్వర్ణలత, నాయకులు శివశంకర్‌, జి.సామయ్య, మంద పాండు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Read more