మహిళలకు అండగా సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-10-01T05:30:00+05:30 IST

మహిళలకు అండగా సీఎం కేసీఆర్‌

మహిళలకు అండగా సీఎం కేసీఆర్‌
కులకచర్ల : చీరలు పంపిణీ చేస్తున్న పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

కులకచర్ల, అక్టోబరు 1: మహిళలకు సీఎం కేసీఆర్‌ అండగా ఉంటున్నారని, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి తెలిపారు. శనివారం కులకచర్ల రైతువేదికలో మహిళలకు బతుకమ్మ చీరలు, 13 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అలాగే చౌడాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు పైబడిన ప్రతీ మహిళకు ప్రభుత్వం తరఫున బతుకమ్మ చీర అందుతుందని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందా్‌సనాయక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హరికృష్ణ, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ పీరంపల్లి రాజు, సర్పంచ్‌లు సౌమ్యారెడ్డి, కొత్త రంగారెడ్డి, ఎంపీటీసీలు ఆనందం, శంకర్‌, తహసీల్దార్లు రమేశ్‌కుమార్‌, అశోక్‌కుమార్‌, కులకచర్ల, చౌడాపూర్‌ మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు శేరి రాంరెడ్డి, సుధాకర్‌రెడ్డి, సింగిల్‌ విండో వైస్‌చైర్మన్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Read more