-
-
Home » Telangana » Rangareddy » Civic Reading Halls-MRGS-Telangana
-
గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పౌర పఠన మందిరాల ఏర్పాటు
ABN , First Publish Date - 2022-09-11T05:05:29+05:30 IST
గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పౌర పఠన మందిరాల ఏర్పాటు

- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి
ఆమనగల్లు, సెప్టెంబరు 10: జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా భవనాలు అం దుబాటులో ఉన్న మున్సిపాలిటీలు, పంచాయతీలు, కాలనీల్లో పౌర పఠన మందిరాలు ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి తెలిపారు. తొలిదశలో 20 పౌరపఠన మందిరాలు ఏర్పాటు చే స్తున్నట్టు వెల్లడించారు. ఆమనగల్లులోని నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులను శనివారం పాండురంగారెడ్డి పరిశీలించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మనోజ్‌కుమార్‌తో కలిసి కడ్తాల మండలం ఎక్వాయిపల్లి, వాసుదేవ్‌పూర్, ముద్విన్ గ్రామాల్లో పర్యటించారు. ఆయా చోట్ల సిద్ధం చేస్తున్న పౌర పఠన మందిర భవనాలను వారు పరిశీలించారు. పాండురంగారెడ్డి మా ట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సూచనలు, అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ సహకారంతో పౌర పఠన మందిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే లైబ్రరీ భవనాలను అందుబాటులో ఉన్న చోట్ల దశలవారీగా వాటిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అన్ని గ్రంథాలయాలను ఆధునికీకరించి పాఠకులకు వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం ఇటీవల రూ.15లక్షలతో అవసరమైన మెటీరియల్‌ను కొనుగోలు చేశామని పాండురంగారెడ్డి వెల్లడించారు. రూ.12కోట్లతో గ్రంథాలయ భవనాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.