పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించాలి

ABN , First Publish Date - 2022-08-15T05:49:10+05:30 IST

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించాలి

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించాలి

కులకచర్ల, ఆగస్టు 14 : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌లు తెలిపారు. మండల పరిధిలోని చెల్లాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ఎంపీపీ తన సొంత డబ్బులతో విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, స్టేషనరీ అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ చంద్రయ్య, పాఠశాల కమిటీ చైర్మన్‌ యాదయ్య, ఉపసర్పంచ్‌ వెంకటయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Read more