వీధికుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు

ABN , First Publish Date - 2022-12-10T00:23:15+05:30 IST

రావిచెడ్‌ గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. బయటకు వెళ్లాలంటేనే వృద్ధులు, పిల్లలు జంకుతున్నారు.

వీధికుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు

కడ్తాల్‌, డిసెంబరు 9: రావిచెడ్‌ గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. బయటకు వెళ్లాలంటేనే వృద్ధులు, పిల్లలు జంకుతున్నారు. శుక్రవారం గ్రామంలో వీధి కుక్కల దాడిలో పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. నిత్యం ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల నివారణకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-10T00:23:16+05:30 IST