-
-
Home » Telangana » Rangareddy » Chalo Assembly should be successful-MRGS-Telangana
-
‘చలో అసెంబ్లీ’ని విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-09-12T05:08:20+05:30 IST
‘చలో అసెంబ్లీ’ని విజయవంతం చేయాలి

ఆమనగల్లు/ఇబ్రహీంపట్నం/షాద్‌నగర్ అర్బన్, సెప్టెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల వారీగా ఉద్యోగ, ఉపాధ్యాయుల కేటాయింపు కోసం తీసుకువచ్చిన జీవో 315ను సవరించి స్థానికతను చేర్చాలని డిమాండ్ చేస్తూ 13న జీవో 315బాధితుల సంఘం ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు కానుగుల మల్లేశ్ తెలిపారు. ఆమనగల్లులో ఆదివారం చలో అసెంబ్లీపై సన్నాహక సమావేశం నిర్వహించారు. 315 జీవోను సవరించి స్థానిక తను చేర్చాలని చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఉద్యోగులు పెద్దఎత్తున హాజరు కావాలన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బాధ్యులు ప్రేమ్‌కుమార్, శ్రీను, శివ, శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు. పదోన్నతులు, బదిలీలు, 315జీవో బాధితుల సమస్యల పరిష్కారానికి 13న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎ్‌సపీసీ) చేపట్టనున్న చలో అసెంబ్లీని విజయవంతం చేయాలని యూఎ్‌సపీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు బింగి రాములయ్య, వెంకటప్ప కోరారు. ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరారు. 13న అసెంబ్లీ ముట్టడి విజయవంతానికి ఉపాధ్యాయులు తరలిరావాలని టీఎ్‌సయుటీఎఫ్ నాయకులు కె.వెంకటయ్య, జి.శివారెడ్డి, ఎన్.నర్సింహులు కోరారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, విద్యావలంటీర్ల నియామకాలు, పాఠశాలల్లో సౌకార్యాలని అసెంబ్లీ తలపెట్టామన్నారు.