చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-11T05:17:25+05:30 IST

చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి

చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి
చేవెళ్ల: చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య

  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య 
  • ఘనంగా ఐలమ్మ 37వ వర్థంతి  
  • నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు


చేవెళ్ల/షాబాద్‌/ఇబ్రహీంపట్నం/షాద్‌నగర్‌ అర్బన్‌/కొందుర్గు/ఆమనగల్లు/కడ్తాల్‌/కందుకూరు/మాడ్గుల/మంచాల/శంషాబాద్‌/మహేశ్వరం, సెప్టెంబరు 10: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కెఎ్‌స.రత్నం, కాంగ్రెస్‌ పార్టీ డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకట్‌స్వామి, కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం అన్నారు. చాకలి ఐలమ్మ 37వ వర్థంతి సందర్బంగా శనివారం చేవెళ్ల రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ ఎం. విజయలక్ష్మి, వైఎస్‌ ఎంపీపీ కర్నె శివప్రసాద్‌, సర్పంచ్‌ బండారి శైలజాఆగిరెడ్డి, బాల్‌రాజ్‌, గంగి యాదయ్య, దేవుని శర్వలింగం, జె. మల్లేశ్‌, జంగయ్య, సీహెచ్‌ శ్రీనివాస్‌, వీరేందర్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్‌లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి రజక సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం చంద్రయ్య పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తమ్మలి రవీందర్‌, రాము, శ్రీశైలం, రమేష్‌, మల్లేష్‌, భరత్‌, కిరణ్‌, యాదయ్య, ముస్తఫా, వెంకటయ్య, రామస్వామి, సాజిత్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు పాల్గొన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌లో ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సీనియర్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దేపల్లి అశోక్‌గౌడ్‌, బీజేపీ నాయకులు నెల్లి శ్రీవర్దన్‌రెడ్డి, పాలమూరు విష్ణువర్దన్‌రెడ్డి, అందె బాబయ్యలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈటే గణేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, వైస్‌చైర్మన్‌ ఎంఎస్‌ నటరాజ్‌, ఎంపీపీ ఖాజా ఇద్రీష్‌ అహ్మద్‌, జడ్పీటీసీ సభ్యుడు పి.వెంకట్‌రాంరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా కొందుర్గు బస్టాండ్‌ ఆవరణలో రజకసంఘం నాయకులు రాయికంటి రామస్వామి, రవికుమార్‌, రాయికంటి గోపాల్‌, లింగం, శివరాములు, జగన్‌ తదితరులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఆమనగల్లులో బస్టాండ్‌ ఎదుట శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ  రహదారి పక్కన రజక సంఘం మండల అధ్యక్షుడు నాగిళ్ల జగన్‌ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌, వైస్‌చైర్మన్‌ దుర్గయ్య, జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్‌ మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ తోట గిరియాదవ్‌, లయన్స్‌క్లబ్‌ ఉపాధ్యక్షుడు పాపిశెట్టి రాము నివాళులర్పించారు. అదేవిధంగా కడ్తాలలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మకు ఘన నివాళులర్పించారు. జడ్పీటీసీ దశరథ్‌ నాయక్‌, సర్పంచ్‌ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, కడారి రామకృష్ణ, రాఘవేందర్‌లు పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మాడ్గులలో సీపీఎం మండల కార్యదర్శి ఈర్ల నర్సింహ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అదేవిధంగా కందుకూరులో రజక సంఘం రంగారెడ్డి జిల్లా నాయకుడు సోమరాజు వెంకటేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మైనార్టీ సెల్‌ ప్రధానకార్యదర్శి ఎండీ అబ్జల్‌బేగ్‌ పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.సుధాకర్‌, కె.అంజయ్య, ఎం.మహేందర్‌ , జి.వెంకటేష్‌, శ్రీరాములు పాల్గొన్నారు. అదేవిధంగా మంచాలలో నిర్వహించిన ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో సర్పంచ్‌ కొంగరవిష్ణువర్దన్‌రెడ్డి, అస్మత్‌పూర్‌ సర్పంచ్‌ ఎన్‌.హరిప్రసాద్‌, ఎంపీటీసీ కావలిశ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ పాండాలజంగయ్య, కార్యదర్శి వెంకటేష్‌ పాల్గొని నివాళులర్పించారు. అదేవిధంగా శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంతో పాటు పెద్దతూప్రాలో ఎంపీపీ దుద్యాలజయమ్మశ్రీనివాస్‌ ఐలమ్మకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ వై.కుమార్‌, వెంకటయ్య, దాస్‌, సురేష్‌, నర్సింహ, గౌతం, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-11T05:17:25+05:30 IST