చైన్‌ స్నాచర్‌ రిమాండ్‌

ABN , First Publish Date - 2022-11-30T00:06:13+05:30 IST

మహిళ మెడలోంచి గొలుసు తెంపుకెళ్లిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఆదిభట్ల సీఐ నరేందర్‌ మంగళవారం తెలిపారు.

చైన్‌ స్నాచర్‌ రిమాండ్‌

ఆదిభట్ల, నవంబరు 29: మహిళ మెడలోంచి గొలుసు తెంపుకెళ్లిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఆదిభట్ల సీఐ నరేందర్‌ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన కాలె కేశవ్‌ ఆదిభట్లలో డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. సోమవారం ఉదయం 5గంటల ప్రాంతంలో కేశవ్‌ భార్య సంధ్య ఇంటి ముంగిలిలో కట్టెలపొయ్యి వెలిగిస్తుండగా ఓ వ్యక్తి వచ్చి బీడీ వెలిగించుకునేందుకు అగ్గిపెట్టి కావాలని అడిగాడు. సంధ్య తెచ్చేలోపే ఆమెను కత్తితో బెదిరించి మెడలోని ఐదు గ్రాముల బంగారు నల్లపూసల తాడు తెంపుకెళ్లాడు. కేశవ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి ఆదిభట్లకు చెందిన దేవర యాదయ్య(45) అనే వ్యక్తి బంగారు గొలుసు తెంపుకెళ్లినట్టు గుర్తించి అతడిని రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-11-30T00:06:13+05:30 IST

Read more