సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి : మంత్రి మల్లారెడ్డి

ABN , First Publish Date - 2022-10-13T04:18:00+05:30 IST

సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి : మంత్రి మల్లారెడ్డి

సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి : మంత్రి మల్లారెడ్డి
సీసీ కెమెరాలను ప్రారంభిస్తున్న మంత్రి మల్లారెడ్డి. చిత్రంలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహే్‌షభగవత్‌

కీసర రూరల్‌, అక్టోబర్‌ 12 : దాతల సహకారంతో మున్సిపాలటీల్లో విరివిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం నాగారం మున్సిపాలిటీ నుంచి కేటాయించిన, దాతల నుంచి సేకరించిన రూ.42లక్షలతో ఏర్పాటు చేసిన 166 సీసీ కెమెరాలను, మారుతిగార్డెన్‌ ఫంక్షన్‌హాల్లో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహే్‌షభగవత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ పరిధిలోని కార్పొరేట్‌ పాఠశాలలు, వ్యాపార సంస్థల యాజమన్యాల ద్వారా సీఎ్‌సఆర్‌ నిధులను సమీకరించుకుని ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్‌ కమిషనర్‌ మహే్‌షభగవత్‌ మాట్లాడుతూ నూతనంగా వెంచర్లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిందన్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటి వరకు దాదాపు 1.60లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ప్రతి సీసీ కెమెరాను నగరంలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంతో అనుసంధానం చేసి, ఏ ప్రాంతంలో ఎలాంటి సంఘటన జరిగిన అక్కడి నుండి స్థానిక అధికారులను అప్రమత్తం చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి డీసీపీ రక్షిత, కుషాయిగూడ ఏసీపీ రష్మీ, నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుంట్ల చద్రారెడ్డి, దమ్మాయిగూడ మున్సిపల్‌ చైర్మన్‌ ప్రణీత, నాగారం మున్సిపల్‌ కమిషనర్‌ వాణి, వైస్‌చైర్మన్‌ మల్లేష్‌, కీసర పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రఘువీర్‌రెడ్డి, ఐకాం కంపనీ ప్రతినిధులు ఉమామహేశ్వర్‌, గౌతమి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-13T04:18:00+05:30 IST