సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-17T04:56:16+05:30 IST

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

షాబాద్‌/తలకొండపల్లి/చేవెళ్ల: షాబాద్‌ మండలంలోని అప్పారెడ్డిగూడ గ్రామపంచాయితీ అనుబంధ గ్రామం లింగారెడ్డిగూడ, కుర్వగూడ, హైతాబాద్‌గ్రామాల్లో షాబాద్‌ జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డి బుధవారం సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. తలకొండపల్లి మండలంలోని వెల్జాల గ్రామపంచాయతీ పరిధిలోని  ఇస్రాయిపల్లిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.5లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు పనులను టీఆర్‌ఎస్‌ జిల్లా సీనియర్‌ నాయకుడు సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. చేవెళ్ల అంబేద్కర్‌ కాలనీలో  రూ.10లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు పనులను సర్పంచ్‌ బండారు శైలజా ఆగిరెడ్డి ప్రారంభించారు.  కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read more