మైసిగండి సర్పంచ్‌పై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-10-15T04:44:26+05:30 IST

మైసిగండి సర్పంచ్‌పై కేసు నమోదు

మైసిగండి సర్పంచ్‌పై కేసు నమోదు

కడ్తాల్‌, అక్టోబరు 14: రోడ్డుపై అడ్డంగా గోతులు తీసి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగించిన కడ్తాల మండలం మైసిగండి సర్పంచ్‌ రామావత్‌ తులసీరామ్‌పై కేసు నమోదు చేసినట్లు కడ్తాల్‌ ఎస్‌ఐ హరిశంకర్‌ గౌడ్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మైసిగండి ఎస్‌పీ నాయక్‌ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిని అనుసరించి గడ్డమీది తండాకు వెళ్లే దారిని ఎలాంటి అనుమతులు లేకుండా సర్పంచ్‌ తులసీరామ్‌ నాయక్‌, ఆయన అనుచరులు జేసీబీ సాయంతో రోడ్డును ధ్వంసం చేసినట్లు తెలిపారు. గడ్డమీది తండా, వెలుగు రాళ్ల తండాల ప్రజలు రోడ్డుపై తీసిన గోతి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. గడ్డమీది తండా సర్పంచ్‌ పాండు నాయక్‌ ఫిర్యాదు మేరకు మైసిగండి సర్పంచ్‌ తులసీరామ్‌ నాయక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరిశంకర్‌ గౌడ్‌ తెలిపారు.   

Read more