ఆమనగల్లులో కారు బీభ త్సం

ABN , First Publish Date - 2022-11-25T00:13:10+05:30 IST

పట్టణంలో గురువారం మధ్యాహ్నం ఓ కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడుపుతూ బీభత్సం సృష్టించాడు.

ఆమనగల్లులో కారు బీభ త్సం
బీభత్సం సృష్టించిన కారు

ఆమనగల్లు, నవంబరు 24: పట్టణంలో గురువారం మధ్యాహ్నం ఓ కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడుపుతూ బీభత్సం సృష్టించాడు. స్థానికుల కథనం ప్రకారం హైదరాబాద్‌లోని మీర్‌పేటకు చెందిన సీతారామ్‌రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు మారుతి ఆల్టో కారులో సోమశిలకు వెళ్లి నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో ఆమనగల్లు పట్టణంలోని అపోలో ఫార్మసీ వద్ద సైకిల్‌పై వెళ్తున్న వేంకటేశ్వర థియేటర్‌లో పనిచేసే సెక్యూరిటీ గార్డు దయాశంకర్‌ను ఢీకొంది. దీంతో డ్రైవర్‌ కారును ఎడమవైపు తిప్పడంతో అక్కడే నిలబడి ఉన్న రిక్షా కార్మికుడు జంతుక దుర్గయ్య, నిలబడి ఉన్న రఘుపతిపేటకు చెందిన మిద్దె రవిలను ఢీకొంది. ఆగివున్న రెండు బైక్‌లను, ఓకారును, రిక్షాను ఢీకొని కారు ఆగిపోయింది. దీంతో డ్రైవర్‌, కారులో ఉన్నవారు భయంతో పోలీ్‌సస్టేషన్‌ కు వెళ్లారు. ప్రమాదంలో గాయపడిన దయాశంకర్‌, జంతుక దుర్గయ్య, మిద్దె రవిలను చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుందరయ్య తెలిపారు.

Updated Date - 2022-11-25T00:13:10+05:30 IST

Read more