-
-
Home » Telangana » Rangareddy » Burning effigies of CM KCR-NGTS-Telangana
-
సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం
ABN , First Publish Date - 2022-08-17T05:47:13+05:30 IST
సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం

కులకచర/దోమ/ఘట్‌కేసర్, ఆగస్టు16: కులకచర్ల చౌరస్తాలో మంగళవారం బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జనగామ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్‌ఎస్ నాయకులు బీజేపీ నాయకులపై దాడిని నిరసిస్తూసీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు మైపాల్ మాట్లాడుతూ, బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగితే సహించేది లేదన్నారు.. దోమ ప్రధాన చౌరస్తాలో బీజేపీ నాయకులు సీఎందిష్టిబొమ్మను దహనం చేశారు. ఘట్‌కేసర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం దిష్టబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో రామోజీ, హనుమాన్, ప్రవీణ్ రావు, రాజా రమేష్, వీరేశం, ప్రభంజన్, శోభారాణి, కరుణాకర్, వెంకటేశ్, మోనాచారి, శరత్, అంజిలయ్య, వినోద్, నర్సింహులు, మల్లేశ్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.