గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-09-11T05:19:52+05:30 IST

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

శంకర్‌పల్లి, సెప్టెంబరు 10: శంకర్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని లక్ష్మారెడ్డిగూడ బస్టాండ్‌ సమీపంలో పంట పొలాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి 70 సంవత్సరాల వరకు ఉంటాయని పోలీసులు అంచనా వేశారు.  చాలా రోజులుగా తిండి లేకుండా ఆకలితో మృతిచెందినట్లు అనుమానిస్తున్నారు. మృతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

Read more