వైభవంగా బొడ్రాయి ప్రతిష్ఠాపన

ABN , First Publish Date - 2022-06-12T07:11:55+05:30 IST

వైభవంగా బొడ్రాయి ప్రతిష్ఠాపన

వైభవంగా బొడ్రాయి ప్రతిష్ఠాపన
జైత్వారంలో బొడ్రాయి ప్రతిష్ఠ పూజల్లో పాల్గొన్న మంత్రి సబితారెడ్డిని ఆశీర్వదిస్తున్న పూజారి

  • పూజల్లో పాల్గొన్న మంత్రి సబితారెడ్డి

మహేశ్వరం/కందుకూరు జూన్‌ 11: మండలంలోని కోళ్లపడకల్‌లో శనివారం బొడ్రాయి నాభిశిల ప్రతిష్ఠాపన చేశారు. బొడ్రాయి, మైసమ్మ బోనాలను నిర్వహించారు. బొడ్రాయి ప్రతిష్ఠాపనలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి పాల్గొని పూజలుచేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నూతన బొడ్రాయి ప్రతిష్ఠాపనతో కోళ్ల పడకల్‌ సుభిక్షంగా ఉండాలన్నారు. కాగా బొడ్రాయిని వేదపండితులు, పూజారులు, గ్రామస్తులు వీధుల్లో ఊరేగించి ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో ఎంపీపీ కె.రఘుమారెడ్డి, కోళ్లపడకల్‌ ఎంపీటీసీ చంద్రయ్య, సర్పంచ్‌ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్‌ ఐ.నర్సింహాగౌడ్‌, కుమార్‌, మల్లేష్‌, రఘుపతి, సత్యనారాయణ పాల్గొన్నారు. అదేవిధంగా కందుకూరు మండలం జైత్వారంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన నిర్వహించారు. పూజల్లో మంత్రి సబితారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, ఎంపీటీసీ సురేష్‌, సర్పంచ్‌ సదాలక్ష్మి, మాజీ సర్పంచ్‌ పి.పర్వతాలు, నాయకులు ఎం.శ్రీశైలం, ఎస్‌.సురేందర్‌రెడ్డి, సాయిలు, కార్తీక్‌, జగన్మోహన్‌రెడ్డి, జయమ్మ, సిద్ధేశ్వర్‌గౌడ్‌, రాజు, పాండుగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-12T07:11:55+05:30 IST