నీచ రాజకీయాలకు ఒడిగడుతున్న బీజేపీ

ABN , First Publish Date - 2022-09-12T05:07:55+05:30 IST

నీచ రాజకీయాలకు ఒడిగడుతున్న బీజేపీ

నీచ రాజకీయాలకు ఒడిగడుతున్న బీజేపీ
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, సెప్టెంబరు 11: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపు తోందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు, మాడ్గుల తలకొండపల్లి, కడ్తాల మండలాలకు చెందిన పలువురికి రూ. 1.45లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆదివారం నగరంలోని తన నివాసంలో నా రాయణరెడ్డి అందజేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జేపీయేతర పాలక ప్రభుత్వాల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. రాజకీయ ఆధిపత్యం కోసం బీజేపీ నీచ రాజకీయాలకు ఒడిగట్టిందన్నారు. విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలదోసేందుకు మోదీ, బీజేపీ నేతల కుట్రల్లో భాగమే ఈడీ, సీబీఐ దా డులన్నారు. పేదరిక నిర్మూలనకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా పథకా లను అమలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధితో విరివిగా సాయమందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వేణుగోపాల్‌, సురే ందర్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, హన్మనాయక్‌, కొండల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, బాబ, నరేశ్‌నాయక్‌, అల్లాజీ పాల్గొన్నారు.

Read more