టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే..

ABN , First Publish Date - 2022-09-12T05:18:07+05:30 IST

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే..

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే..
రాయికల్‌ గ్రామ యువకులకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న శ్రీవర్ధన్‌రెడ్డి

షాద్‌నగర్‌ అర్బన్‌, సెప్టెంబరు11: తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాజకీయ మార్పు కోరుతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీయేనని  ఆ పార్టీ షాద్‌నగర్‌ ఇన్‌చార్జ్జి నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి అన్నారు. ఫరూఖ్‌నగర్‌ మండలంలోని రాయికల్‌ గ్రామంలో ఆదివారం పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని కోరుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ భయపడి, ఎన్నడు లేని విధంగా సెప్టెంబర్‌ 17న నిర్వహించాలిన వియోచన దినాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపబోతున్నారన్నారు.  వచ్చే ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు  కలిసిపోతాయని, వాటిని ఎదురించి విజయం సాధించే సత్తా బీజేపీకే ఉందని అన్నారు.  ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అప్పులను తెచ్చి, అభివృద్ధిని కుంటుపడేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు తగిన బుద్ది చెప్పడానికి యువత  బీజేపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, దొడల వెంకటే్‌షయాదవ్‌, సురేష్‌, నరేష్‌, దినే్‌షరెడ్డి, రమే్‌షగౌడ్‌, యాదయ్య పాల్గొన్నారు.

Read more