బీజేపీ కుట్రలు తెలంగాణలో ఫలించవు

ABN , First Publish Date - 2022-07-05T05:30:00+05:30 IST

బీజేపీ కుట్రలు తెలంగాణలో ఫలించవు

బీజేపీ కుట్రలు తెలంగాణలో ఫలించవు
పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి

  • ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, జూలై 5: బీజేపీ కుట్రలు తెలంగాణలో సాగవని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి  అన్నారు. డబుల్‌ ఇంజిన్‌(బీజేపీ) సర్కార్‌ ఉన్న రాష్ట్రాల్లో చేపట్టని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్‌ సింగిల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో చేసి దేశాని కే మార్గదర్శకంగా నిలిచారన్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మంగళవారం పల్గుతండాకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు ముడావత్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. వారి కి గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ నాయకత్వంలో సాగుతున్న ప్రజారంజక పాలన చూసి ఓర్వలేని బీజేపీ.. పథకం ప్రకారం టీఆర్‌ఎ్‌సపై కుట్రలు చేస్తోందన్నారు. బీజేపీని ప్రజలు నమ్మడం లేదని, కాంగ్రెస్‌ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. టీఆర్‌ఎస్‌ తిరుగులేని శక్తి అని, మరో రెండుసార్లూ టీఆర్‌ఎ్‌సదే అధికారం అన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న అ భివృద్ధిని చూసే పార్టీలో చేరుతున్నారన్నారు. టీఆర్‌ఎ్‌సలో చేరిన వారిలో చంద్య నాయక్‌, గేమ్యనాయక్‌, పంతూ, రమేశ్‌, రాములు, నంద్య, గణేశ్‌, తిరుపతి, నర్య, నవీన్‌, రాజు, తేజ, అనిల్‌, నాగు ఉన్నారు. నాయకులు యాగిరిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, హన్మనాయక్‌, సురేందర్‌రెడ్డి, విజయ్‌రాథోడ్‌, నరేశ్‌నాయక్‌ పాల్గొన్నారు. 

Read more