వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ముఖద్వారం నిర్మాణానికి భూమిపూజ

ABN , First Publish Date - 2022-04-11T05:20:14+05:30 IST

వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ముఖద్వారం నిర్మాణానికి భూమిపూజ

వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ముఖద్వారం నిర్మాణానికి భూమిపూజ
భూమిపూజలో పాల్గొన్న గ్రామస్తులు

బషీరాబాద్‌, ఏప్రిల్‌ 10: మండలంలోని పర్వత్‌పల్ల్లి గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ముఖ ద్వారం(కమాన్‌) నిర్మాణానికి ఆదివారం గ్రామస్తులు భూమిపూజ చేశారు. ఊరి చివర ప్రధాన మలుపు వద్ద ఆలయ ముఖద్వారం నిర్మించేందుకు గ్రామ పెద్దలు ఇటీవల నిర్ణయించారు. ఈ క్రమంలో ఆలయ పునః నిర్మాణంతో పాటు ముఖ ద్వారా నిర్మాణం పనులను మూడు నెలల్లోగా పూర్తికి చర్యలు తీసుకుంటామని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.ఈ భూమిపూజలో మాజీ సర్పంచ్‌ పి.జైపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ జి. బ్రహ్మనందరెడ్డి, స్థానిక నాయకులు నర్సిరెడ్డి, కె. గోపాల్‌రెడ్డి, పి.పాండురంగారెడ్డి, ఎస్‌.జనార్ధన్‌రెడ్డి, కె.భూపాల్‌రెడ్డి, పాషా, అంగినెళ్లి రాములు, కూర్వ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Read more