టెక్నికల్‌ సాక్ష్యాల సేకరణలో ఉత్తమ ప్రతిభ

ABN , First Publish Date - 2022-04-25T05:21:24+05:30 IST

టెక్నికల్‌ సాక్ష్యాల సేకరణలో ఉత్తమ ప్రతిభ

టెక్నికల్‌ సాక్ష్యాల సేకరణలో ఉత్తమ ప్రతిభ


  • వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్‌, ఏప్రిల్‌ 24 : టెక్నికల్‌ సాక్ష్యాల సేకరణలో జిల్లా ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ కోర్‌ టీమ్‌  ఉత్తమ ప్రతిభ కనబరుస్తోందని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జరుగుతున్న వివిధ టెక్నికకల్‌, సైబర్‌ నేరాల నియంత్రణకు కఠినచర్యలు తీసుకుంటున్నామన్నారు. అట్టి  కేసుల్లో టెక్నికల్‌ సాక్ష్యాల సేకరణలో జిల్లా ఐటీసీటీ అధికారులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. నేటి సమాజంలో ఆన్‌లైన్‌, సైబర్‌ మోసాలు, సోషల్‌మీడియాలో అసత్య, అభ్యంతర పోస్టింగ్‌లు, వైట్‌కాలర్‌ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. అందుకు గాను ఐటీసీటీకు ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఐలు సుష్మితా, శైలజాలను  నియమించడం జరిగిందన్నారు. జిల్లాలో ఐటీ కోర్‌ టీమ్‌లో ప్రతి విషయంపై ఒక సెల్‌ను ఏర్పాటు చేసి సిబ్బంది, అధికారులు సమస్యలను పరిష్కంచనున్నారని తెలిపారు. 

Read more